Shobhita Dhulipala: షారుఖ్ ఖాన్ ను బీట్ చేసిన శోభితా ధూళిపాళ్ల..ఆ విషయంలో అమ్మడే ముందు

Sobhita Dhulipala : టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ ఎంగేజ్ మెంట్ ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శోభితా ధూళిపాళ ట్రెండ్ అవుతున్నారు. ఐఎండీబీ విడుదల చేసిన ఈవారం ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల లిస్టులో రెండవ స్థానంలో నిలిచారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Aug 2024 9:29 AM IST
Sobhita Dhulipala is second in the list of popular Indian actresses
X

Shobhita Dhulipala: షారుఖ్ ఖాన్ ను బీట్ చేసిన శోభితా ధూళిపాళ్ల..ఆ విషయంలో అమ్మడే ముందు

Sobhita Dhulipala-Shah Rukh Khan : టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ ఎంగేజ్ మెంట్ ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎంగేజ్ మెంట్ తో శోభితా గురించి చాలా మంది తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో శోభితా ఎక్కువ ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల లిస్టులో రెండవ స్థానంలో నిలిచారు. ఇండియన్ మూవీస్ డేటాబేస్ ఈ వారం విడుదల చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సెలబ్రిటీల జాబితాలో శోభితా రెండోస్థానంలో నిలవగా..నటి శార్వరీ మొదటి స్థానంలో నిలిచారు.

ముంజ్యా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐఎండిబి బ్రేక్ అవుట్ స్టార్ మీటర్ అవార్డును గెలుచుకోవడంతో శార్వరీ మొదటిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత శోభిత ధూళిపాళ రెండో స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మూడో స్థానంలో నిలవగా..నాలుగో స్థానంలో కాజల్, ఐదోస్థానంలో జాన్వీ కపూర్ లు ఉన్నారు. లక్ష్య, దీపికా పదుకుణే, విజయ్ సేతుపతి, మ్రుణాల్ ఠాకూర్, ఐశ్వర్యరాయ్ ఈ వారం టాప్ పదిలో ఉన్నారు.

ఇక శోభిత, చైతన్య 2022 నుంచి డేటింగ్ చేస్తున్నారు. గత గురువారం వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఎంగేజ్ మెంట్ తర్వాత శోభితా తన సంతోషాన్ని వ్యక్త పరిచింది. మనం పరిచయం ఎలా మొదలైనా..ప్రేమలో మన మనస్సులు కలిసాయి అంటూ రాసారు.శోభితా టాలీవుడ్,బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ లోనూ యాక్ట్ చేస్తున్నారు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story