Maheshbabu: స్టేజ్‌పై రష్మిక క్యూట్ డైలాగ్స్.. ఫిదా అయిన మహేష్ బాబు.. టైట్ హగ్‌తో షాకిచ్చిన సూపర్‌స్టార్..!

యానిమాల్ సినిమా ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రాండ్ ఎంట్రీతో మరింత ఊపందుకుంది. మహేష్ బాబుతో పాటు రాజమౌళి కూడా ఈ వేడకకు వచ్చారు.

Jyothi
Published on: 28 Nov 2023 11:32 AM IST
So Cute so Sweet so Handsome says Rashmika Mandanna to Superstar Mahesh Babu in Animal Pre Release Event
X

Maheshbabu: స్టేజ్‌పై రష్మిక క్యూట్ డైలాగ్స్.. ఫిదా అయిన మహేష్ బాబు.. టైట్ హగ్‌తో షాకిచ్చిన సూపర్‌స్టార్..!

Maheshbabu: యానిమాల్ సినిమా ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రాండ్ ఎంట్రీతో మరింత ఊపందుకుంది. మహేష్ బాబుతో పాటు రాజమౌళి కూడా ఈ వేడకకు వచ్చారు. దీంతో ఈ సినిమాపై విసరీతమైన హైప్ క్రియేట్ చేశారు. కాగా, మహేష్ బాబు చాలా రోజుల తరువాత ఇలాంటి ఈవెంట్‌లో కనిపించాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ క్రమంలో స్టేజ్‌పైన రష్మిక మందన్న కూడా మహేష్ బాబును చూసి ఫిదా అయింది. దీంతో స్టేజ్‌పైన తను చేసిన పనితో మహేష్ కూడా తన ముసి ముసి నవ్వులతో అందర్నీ నవ్వించేశారు.

రష్మిక తన స్వీట్ స్వీట్ వాయిస్‌తో మహేష్ బాబును పొగిడేసింది. ఈ హిజ్ సో క్యూట్, సో స్వీట్, సో హ్యాండ్సమ్ అంటూ పొగిడేసింది. ఆమె అలా క్యూట్‌గా చెప్పడంతో మహేష్ బాబు నవ్వుతూ రష్మికను గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, రష్మిక, మహేష్ బాబు కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బ్యూటిఫుల్ పాటతోనే మహేష్ బాబును పొగిడేసింది.

Jyothi

Jyothi

Next Story