భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Smart Beauty Demanding Huge Remuneration
x

భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Highlights

Nabha Natesh: నిర్మాతలను భయపెడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh: యువ హరో రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "ఇస్మార్ట్ శంకర్". ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. నభా నటేష్ మరియు నిధి అగర్వాల్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ ఇద్దరు భామలకు మంచి ఆఫర్లు వచ్చాయి కానీ కరోనా కారణంగా చాలా వరకు షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక మళ్లీ ఆఫర్లు పెరగటం మొదలైంది అని అనుకుంటున్న సమయంలో నభా ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. మరోవైపు నిధి అగర్వాల్ పరభాషలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్న కారణంగానే ఆమెకు ఆఫర్లు తక్కువైపోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తన క్రేజ్ ను ఎక్కువగా భావిస్తుంది అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొత్త హీరోయిన్లు కోటి వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. వారికి ఏమాత్రం తగ్గకుండా అదే రేంజ్ లో నభా కూడా ఆ రేంజిలో డిమాండ్ చేస్తూ ఉందట. కానీ అంత ఇవ్వలేక నిర్మాతలు వెనక్కి వచ్చేస్తున్నారు. తాజాగా ఒక ప్రముఖ నిర్మాత నభా ను సంప్రదించగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దీంతో ఆ నిర్మాత వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఇలా కెరియర్ ఆరంభంలోనే సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటే మరికొన్ని నెలల తర్వాత ఆమెకి సినిమాల్లో కరియరే ఉండదు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories