రామ్ చరణ్ సినిమాలో ఎస్.జె.సూర్య పాత్ర ఇదే?

SJ Surya Will be Seen in the Role of Chief Minister in the RC15 Movie
x

రామ్ చరణ్ సినిమాలో ఎస్.జె.సూర్య పాత్ర ఇదే?

Highlights

*రామ్ చరణ్ సినిమాలో ఎస్.జె.సూర్య పాత్ర ఇదే?

SJ Surya: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆచార్య" సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నారు. #ఆర్సీ15 అనే టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ యాక్టర్ మరియు డైరెక్టర్ ఎస్.జె.సూర్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఎస్.జె.సూర్య పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఎస్ జే సూర్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. తండ్రి మరియు కొడుకు పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. సినిమా కథ ఎలక్షన్ కమిషన్ ఆధారంగా ఉండబోతుందట.

ఈ మధ్యనే అమృత్ సర్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. "వినయ విధేయ రామ" సినిమా తర్వాత మళ్లీ రామ్ చరణ్ సరసన రెండవసారి కనిపించబోతోంది ఈ భామ.

Show Full Article
Print Article
Next Story
More Stories