SJ Surya: నాని ఫ్లాప్ అయ్యాక మహేష్ బాబు ఏమన్నారో చెప్పిన ఎస్ జే సూర్య

SJ Surya: "సినిమా ఫ్లాప్ అయినప్పుడు మహేష్ బాబు నాతో ఏమన్నారంటే.." అంటున్న ఎస్ జే సూర్య

Jyothi
Published on: 28 Nov 2022 7:20 AM IST
SJ Surya Feels Regret About Mahesh Babu Nani Movie
X

SJ Surya: నాని ఫ్లాప్ అయ్యాక మహేష్ బాబు ఏమన్నారో చెప్పిన ఎస్ జే సూర్య 

SJ Surya: కోలీవుడ్లో ప్రముఖ నటుడైన ఎస్ జే సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. పవన్ కళ్యాణ్ హీరోగా "ఖుషి" సినిమాకి దర్శకత్వం వహించి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎస్ జె సూర్య మహేష్ బాబు తో "నాని" సినిమాకి దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత "స్పైడర్" సినిమాలో విలన్ పాత్రలో కూడా కనిపించారు. కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎస్ జే సూర్య మహేష్ బాబుకి హిట్ ఇవ్వలేకపోయాను అనే రిగ్రెట్ ఉందని పేర్కొన్నారు.

"స్పైడర్ సినిమాలో మీరు మహేష్ బాబుతో కలిసి నటించారు కానీ నాని సినిమాకి మీరే దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీరు ఏమనుకున్నారు," అని అడగగా ఎస్ జె సూర్య ఆ సినిమా విషయంలో తాను చాలా బాధపడ్డానని అన్నారు. "ఇప్పటివరకునాకు ఆ బాధ లోపల ఉంది. ఒక పెద్ద హీరో అవ్వాలని నేను ఇండస్ట్రీకి వచ్చాను. డైరెక్టర్ని అయిపోయాను. ప్రతి సినిమాని మనం ప్రేమతోనే చేస్తాం. కానీ ఆ తప్పు జరిగింది. ఆ టైంలో మహేష్ బాబు ఒక మాట అన్నారు. సార్ మీరు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు సినిమా రిసల్ట్ ఎలా ఉన్నా ఐ లవ్ యు సార్ అన్నారు. పవన్ కళ్యాణ్ కి ఒక మంచి వ్యక్తి ఇవ్వగలిగాను కానీ మహేష్ బాబుకి మాత్రం ఇవ్వలేకపోయాను అని రిగ్రెట్ ఉంది. ఎప్పటికైనా దేవుడు నాకు మళ్ళీ అలాంటి ఒక అవకాశాన్ని ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. మహేష్ బాబు గారు ఒప్పుకుంటే ఆయనతో ఎప్పటికైనా ఒక సినిమా చేస్తాను," అని అన్నారు ఎస్ జే సూర్య.

Jyothi

Jyothi

Next Story