Sivakarthikeya New Movie 2021: జాతిరత్నంతో తమిళ హీరో చిత్రం..!!

Sandeep Reddy
Updated on: 22 Sept 2021 12:27 PM IST
Sivakarthikeyan And Anudeep Combo New Movie Will Begin in Tollywood
X

అనుదీప్-శివకార్తికేయన్ (ఫైల్ ఫోటో)

Sivakarthikeya New Movie 2021: తమిళ చిత్ర పరిశ్రమలో హీరో, సింగర్, నిర్మాతగా పలు విభాగాల్లో రాణిస్తూ మంచి గుర్తింపు పొందిన నటుడు శివకార్తికేయన్ త్వరలో తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. జాతి రత్నాలు చిత్రంతో దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా రాబోతున్నట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే "జాతిరత్నాలు" సినిమా తర్వాత కామెడీ థ్రిల్లర్ వంటి కథలను సిద్ధం చేసుకున్న అనుదీప్ శివకార్తికేయన్ కి కథ వినిపించాడని దానికి శివకార్తికేయన్ కూడా ఓకే చెప్పాడని తెలుస్తుంది.

"డాక్టర్" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న శివకార్తికేయన్ ఈ సినిమా షూటింగ్ తర్వాత అటు డాన్ చిత్రంతో పాటు అనుదీప్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో నటించబోతున్నాడు. అతి త్వరలో అనుదీప్-శివకార్తికేయన్ ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. రెమో, సీమరాజా, హీరో వంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారని సమాచారం.ఇక తెలుగులో జాతిరత్నాలు ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ తన మొదటి చిత్రంతోనే 50 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story