Thaman - Gopi Sundar: థమన్ వదిలేసిన పనిని పూర్తి చేసిన గోపీ సుందర్

admin1
Updated on: 13 Aug 2021 1:12 PM IST
Siva Nirvana Replace The Gopi Sundar in The Place Of Thaman in New Movie
X

థమన్  - గోపి  సుందర్ (ఫైల్ ఫోటో) 

Thaman - Gopi Sundar: "వీ" మధ్యనే ఈ సినిమాతో డిజాస్టర్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు "టక్ జగదీష్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఏదో ఒక విధంగా ఈ సినిమాకి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. అసలే కరోనా వల్ల షూటింగ్ మరియు విడుదల ఆలస్యమయ్యాయి అనుకుంటే మరో వైపు దర్శకుడు శివ నిర్వాణ మరియు సంగీత దర్శకుడు థమన్ మధ్య జరిగిన గొడవ వల్ల సినిమా మరింత ఆలస్యం అయింది. కారణాలు తెలియకపోయినా శివ నిర్వాణ మరియు థమన్ కి మధ్య గొడవ అయిందని థమన్ ఆఖరికి శివ నిర్వాణ కాల్స్ కూడా ఎత్తడం లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో లో సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉండడంతో శివ నిర్వాణ ప్రముఖ సంగీత దర్శకుడు గోపీసుందర్ ని రంగంలోకి దింపారు. ఇంతకుముందు శివ నిర్వాణ దర్శకత్వం వహించిన "నిన్నుకోరి" మరియు "మజిలీ" సినిమాలకు సంగీతాన్ని అందించిన గోపీ సుందర్ ఈ సినిమాకి కూడా పెండింగ్ లో ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్ ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో శివ నిర్వాణ "టక్ జగదీష్" సినిమా ఫైనల్ కాపీని పూర్తిచేసినట్లు సమాచారం. రీతు వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా లో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 10 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

admin1

admin1

Next Story