Tamara Movie: మొట్టమొదటి ఇంటర్నేషనల్ సినిమాని ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్

* ఇంటర్నేషనల్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ

admin1
Updated on: 6 Nov 2021 5:45 PM IST
Sithara Entertainments Announces the First International Movie Tamara to be Directed by Ravi K Chandran
X

ఇంటర్నేషనల్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ (ఫైల్ ఫోటో)

Sithara Entertainments - Tamara Movie: ప్రేమమ్, భీష్మ, జెర్సీ వంటి సూపర్ హిట్ సినిమాల ని మనకి అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పుడు పలువురు స్టార్ హీరోల ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ ఒక ఇంటర్నేషనల్ సినిమా తో అందరి దృష్టిని ఆకర్షించపోతోంది.

తాజాగా సితార ఎంటర్టైన్మెంట్ వారు తమ మొట్టమొదటి ఇంటర్నేషనల్ ప్రాజెక్టుని ప్రకటించారు. ఆ సినిమాకి "తమర" అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇది ఇండో ఫ్రెంచ్ కొలాబరేషన్ అని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇక పోస్టర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరోవైపు రవి కే చంద్రన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కూడా సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story