Mahesh Babu: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సితార.. వారి కోసం ‘గుంటూరుకారం’ స్పెషల్‌ షో..

Guntur Kaaram: సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కూతురు సితార నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది.

Arun Chilukuri
Published on: 21 Jan 2024 4:06 PM IST
Sitara Hosts Special Screening of Guntur Kaaram for Orphans
X

Mahesh Babu: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సితార.. వారి కోసం ‘గుంటూరుకారం’ స్పెషల్‌ షో..

Guntur Kaaram: సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కూతురు సితార నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ గొప్ప మనసు చాటుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాకుండా పలు యాడ్ షూట్స్‌ చేస్తూ డబ్బు సంపాదిస్తుంది. ఇటీవల సితార పేదింటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసింది. తాజాగా, సితార మరోసారి అనాధ పిల్లల విషయంలో గొప్ప మనసు చాటుకుని నెట్టింట ప్రశంసలు అందుకుంటుంది.

సితార.. అనాథ చిన్నారుల కోసం తన తండ్రి మహేష్ బాబు నటించిన ‘గుంటూరుకారం’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఏఎంబీ సినిమాస్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు సితార హాజరయ్యారు. చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారితో ఫొటోలు దిగారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సితార మంచి తనాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story