Sitara: మొట్టమొదటిసారిగా వెండితెరపై కనిపించబోతున్న సితార ఘట్టమనేని

Sitara Ghattamaneni: "నిన్ను గర్వపడేలా చేస్తాను" అంటున్న మహేష్ బాబు కూతురు

admin1
Published on: 20 March 2022 8:39 AM IST
Sitara Ghattamaneni is Going to Appear on The Silver Screen for The First Time
X

Sitara: మొట్టమొదటిసారిగా వెండితెరపై కనిపించబోతున్న సితార ఘట్టమనేని

Sitara Ghattamaneni: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మరింత పాపులర్ అయింది సితార. మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాక తన కంటూ ప్రత్యేకంగా అభిమానులను ఏర్పరచుకుంది.

గత కొంతకాలంగా చిన్న చిన్న డాన్స్ వీడియో లు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సితార తాజాగా ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి వెండితెరపై కూడా కనిపించడానికి సిద్ధమవుతోంది. మహేష్ బాబు హీరో గా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమాలో ఒక పాటలో సితార కూడా మహేష్ బాబుతో కలిసి డాన్స్ చేయబోతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మొట్టమొదటిసారిగా తన తండ్రి సినిమాతో వెండి తెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది సితార. ఈ విషయాన్ని స్వయంగా ఒక వీడియో ద్వారా షేర్ చేస్తూ "సర్కారు వారి పాట టీంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాన్న.. నేను నిన్ను గర్వపడేలా చేస్తాను అనుకుంటున్నాను. మా పెన్నీ పాట ప్రోమో ఇదే" అంటూ చెప్పుకొచ్చింది సితార.

admin1

admin1

Next Story