స్వాతిముత్యం డైరెక్టర్ కి పెద్ద ఆఫర్ ఇచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్

Sitara Entertainments Gave A Big Offer To Swathimutyam Director
x

స్వాతిముత్యం డైరెక్టర్ కి పెద్ద ఆఫర్ ఇచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్

Highlights

* ఫ్లాప్ అయినా సినిమా డైరెక్టర్ కి మరొక అవకాశం ఇస్తున్న నిర్మాత

TollyWood: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఒక్క పెద్ద హిట్టు కూడా అందుకోలేకపోయారు ఇప్పటిదాకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో "రాక్షసుడు" తప్ప మరొక హిట్టు సినిమా లేదు. ఇక తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడైన బెల్లంకొండ గణేష్ "స్వాతిముత్యం" సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అందింది. సితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మించారు. 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్ర థియేటర్ల రైట్స్ 4 కోట్లకు అమ్ముడయ్యాయి. థియేటర్ల వద్ద సినిమాకి వచ్చిన కలెక్షన్లు అంతంత మాత్రం గానే ఉన్నాయి కాబట్టి ఈ సినిమా మూడు కోట్ల నష్టాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు.

స్వాతిముత్యం సినిమా రిసల్ట్ ఎలా ఉన్నప్పటికీ సూర్యదేవర నాగ వంశీకి మాత్రం చిత్ర డైరెక్టర్ పై ఇంకా కాన్ఫిడెన్స్ ఉందట. లక్ష్మణ్ కె కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.. సినిమా చాలా బాగుంటుందని కేవలం నటీనటుల వల్ల మాత్రమే సినిమా ఆడలేదు అని వంశీ చెప్తున్నారు. అందుకే స్వాతిముత్యం సినిమా డిజాస్టర్ అయినప్పటికీ లక్ష్మణ్ కే కృష్ణ పనితనంపై నాగవంశీకి చాలా నమ్మకం ఉందట.

అందుకే లక్ష్మణ్ తో మరొక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పర్మ్ డొనేషన్ ఆధారంగా తెరకెక్కిన కథ ఇది. వర్షా బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందని అని, కథని డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం చాలా ఇంప్రెస్సివ్ గా ఉందని ఈ సినిమాకి చాలానే మంచి రివ్యూలు వచ్చాయి. ఇలా సినిమా పెద్ద ఆడకపోయినా డైరెక్టర్ కి మాత్రం ఇప్పుడు మరొక పెద్ద ఆఫర్ వచ్చినట్లు చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories