Sitara: నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి.. వెక్కివెక్కి ఏడ్చిన సితార..

Sitara Crying: సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ బాబు తల్లి ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Arun Chilukuri
Published on: 28 Sept 2022 12:52 PM IST
Sitara Crying at Indira Devi Dead Body
X

Sitara: నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి.. వెక్కివెక్కి ఏడ్చిన సితార..

Sitara Crying: సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ బాబు తల్లి ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కుమార్తె 'సితార' తట్టుకోలేకపోయారు. నాన్నమ్మను కోల్పోయిన సితార వెక్కివెక్కి ఏడుస్తోంది. తాతయ్య కృష్ణ, తండ్రి మహేష్‌ ఎంత ఓదారుస్తున్నా కన్నీరు ఆగడం లేదు. మహేష్‌ ఒడిలో కూర్చుని సితార ఏడుస్తూనే ఉంది. తల్లి నమ్రత ఓదారుస్తున్నా కూడా తేరుకోలేకపోయింది.

సితారకు తన నాన్నమ్మతో చాలా ఎమోషనల్ బాండింగ్‌ ఉంది. ఏ పండగొచ్చినా కచ్చితంగా నానమ్మ దగ్గరకు వెళ్తుంది. రోజంతా అక్కడ సంతోషంగా గడుపుతుంది. ఇది చూసిన ఇందిరాదేవి ఎంతగానో మురిసిపోయేవారు. నా కొడుక్కి పర్‌ఫెక్ట్‌ కూతురిని నువ్వు అంటూ.. సితారను ఎంతో మురిపెంగా చూసుకునేవారు. నాన్నమ్మను కోల్పోయిన బాధలో సితార కన్నీరు ఆపుకోలేకపోతున్నా దృశ్యాలు అందరి హృదయాల్నీ కలచివేస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story