యూట్యూబ్ లో వైరల్ గా మారిన సీతారామం డిలీటెడ్ సీన్

యూట్యూబ్ లో వైరల్ గా మారిన సీతారామం డిలీటెడ్ సీన్

Rama Rao
Updated on: 7 Sept 2022 8:31 PM IST
Sita Ramam Movie Deleted Scene Which has Gone Viral on YouTube
X

యూట్యూబ్ లో వైరల్ గా మారిన సీతారామం డిలీటెడ్ సీన్

Sita Ramam Deleted Scene: దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన సీతారామం సినిమా ఈమధ్యనే థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు ముందుకి వచ్చిన ఒక అద్భుతమైన ప్రేమ కథగా ఈ సినిమా చరిత్రను సృష్టించింది. ఒక ఎపిక్ ప్రేమ కథగా మిగిలిపోయిన ఈ సినిమా లో రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈమె ఆఫ్రిన్ అనే ఒక పాకిస్తాన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది.

ఒక ముఖ్యమైన పనిమీద ఆఫ్రిన్ పాత్ర ఇష్టం లేకుండానే భారతదేశానికి వస్తుంది. ఇక సీతామహాలక్ష్మి గురించి వెతికే ప్రయత్నం చేస్తున్న ఆఫ్రీన్ నూర్జహాన్ కాలేజీకి వెళుతుంది. అయితే ఆ తరువాత వచ్చే ఒక సన్నివేశాన్ని దర్శక నిర్మాతలు కట్ చేసేశారు. తాజాగా ఇప్పుడు సీతారామం సినిమా నుంచి డిలీట్ సీన్ అంటూ యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. తన పర్సుని టాక్సీలో మర్చిపోయాను అని అనుకున్న ఆఫ్రిన్ పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది.

కానీ ఆ టాక్సీ మరియు టాక్సీ డ్రైవర్ అక్కడే ఉండటంతో నిట్టురుస్తూ "ఇండియాలో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట" అంటూ వెటకారంగా అంటుంది. ఇక టాక్సీ డ్రైవర్ పాత్రలో పెళ్లిచూపులు ఫేమ్ అభయ్, ఇక్కడ అందరూ నాలాంటి వాళ్లే ఉంటారు మేడం అంటూ తన పర్సుని తిరిగి ఇస్తూ "మీ బ్యాగ్ తీసుకువెళ్లి మా దేశ పరువు ని నీతో పాటు పంపించలేను మేడం" అని జవాబు ఇస్తాడు. అయితే ఈ సన్నివేశంతో లేనిపోని కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయని అనుకున్న చిత్రబృందం దీనిని డిలీట్ చేసిందట.

Rama Rao

Rama Rao

Next Story