మళ్లీ అదే హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న సీతారామం డైరెక్టర్

*సీతారామం డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా?

Jyothi
Published on: 13 Feb 2023 3:36 PM IST
Sita Ramam Director is Again Planning a Film With the Same Hero
X

మళ్లీ అదే హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న సీతారామం డైరెక్టర్

Hanu Raghavapudi: సీతారామం సినిమాతో డైరెక్టర్ హను రాఘవపూడి ప్యాన్ ఇండియా రేంజి లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత "సీతారామం" సినిమా ఒక క్లాసిక్ ప్రేమ కథ గా కల్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం స్టార్ హీరోలందరూ వేరే ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే హను రాఘవపూడి తన నెక్స్ట్ సినిమా కోసం ఒక అద్భుతమైన పిరియాడిక్ ప్రేమ కథను సిద్ధం చేసుకున్నారట. కానీ ఇప్పుడు ఏ హీరోతో ఈ సినిమాని మొదలుపెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం నాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో నాని "కృష్ణ గాడి వీర ప్రేమ గాధ" సినిమాలో హీరోగా నటించారు.

ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ సినిమా కోసం కూడా హను రాఘవపూడి నానిని సంప్రదించారట. నాని కూడా దసరా సినిమా తర్వాత ఇంకొక ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తండ్రీ కూతుర్ల సెంటిమెంటుతో నడుస్తుంది. ఆ సినిమా తర్వాత నాని కాల్ షీట్లను బట్టి హను రాఘవ పొడి తో సినిమా గురించి క్లారిటీ రావచ్చు.

Jyothi

Jyothi

Next Story