Mrunal Thakur: "వారి ప్రోత్సాహం కారణం గానే ఇప్పుడిలా ఉన్నాను,"

Mrunal Thakur: "సీతా రామం" బ్యూటీని అసలు సినిమాల్లోకి వెళ్ళద్దు అన్నారట..

Dhatripriya
Updated on: 2 April 2023 3:00 PM IST
Sita Ramam Beauty Does Not Allow To Act In Movies
X

Mrunal Thakur: "వారి ప్రోత్సాహం కారణం గానే ఇప్పుడిలా ఉన్నాను," 

Mrunal Thakur: బాలీవుడ్లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన మృణాల్ ఠాకూర్ "సీతా రామం" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయిపోయింది. ఒకవైపు ఈమె సౌత్ లో వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు నాని తదుపరి సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం మరియు కెరియర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన తల్లిదండ్రులే అని అంటోంది. "అసలు యాక్టింగ్ చేయాలని అనుకున్న సమయంలో వారు మొదట నో అన్నారు. సీరియల్స్ కూడా అవసరం లేదు అన్నారు. ఇండస్ట్రీ గురించి వారికి ఉన్న భయం వల్లనే వాళ్ళు మొదట ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత నా ఇష్టం కాదనలేకపోయారు," అని చెప్పుకొచ్చింది మృణాల్. "వారి ప్రోత్సాహం వల్లనే టీవీ సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టాను. ఆ తర్వాత మరాఠీ సినిమా లో హీరోయిన్ గా పరిచయం అయ్యాను. నా కెరీర్ మొదలైనప్పటి నుండి వారు నా విషయంలో గర్విస్తూనే ఉన్నారు. వారి ప్రోత్సాహం కారణం గానే నేను ఇప్పుడు నా కెరీర్ లో ముందుకు సాగుతున్నాను," అని చెప్పుకొచ్చింది మృణాల్.

"మనం లో గా ఉన్నప్పుడు ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుంటుందని అనుకుంటాం. కానీ అలా దొరకనప్పుడు కూడా మనం విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నించాలి," అని అంటోంది మృణాల్. ఇక సినిమాల పరంగా చూస్తే నాని తో ఒక సినిమా చేస్తున్న మృణాల్ ఠాకూర్ తెలుగు లో మరొక రెండు మూడు సినిమాలలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా సమాచారం.

Dhatripriya

Dhatripriya

Next Story