Raja Chembolu Gets Engaged : ఓ ఇంటివాడు కాబోతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు!

Raja Chembolu Gets Engaged : సిరివెన్నెల సీతారామశాస్త్రి... ఈ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో.. ఎన్నో అత్యద్భుతమైన పాటల రాసి అందరిని

Krishna
Published on: 16 Aug 2020 5:45 PM IST
Raja Chembolu Gets Engaged : ఓ ఇంటివాడు కాబోతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు!
X
Raja Chembolu Gets Engaged

Raja Chembolu Gets Engaged : సిరివెన్నెల సీతారామశాస్త్రి... ఈ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో.. ఎన్నో అత్యద్భుతమైన పాటల రాసి అందరిని అలరించారు... అయన కుమారుడు రాజా చెంబోలు కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అయితే అయన తండ్రి లాగా పాటల రచయితగా కాకుండా నటన వైపు వెళ్లారు రాజా చెంబోలు.. అంతరిక్షం, ఎవడు, హ్యాపీ వెడ్డింగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఫిదా , రణరంగం, మిస్టర్ మజ్ను, ఏబీసీడీ' వంటి ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇందులో ఫిదా సినిమా రాజాకి మంచి పేరును తీసుకువచ్చింది. ఇప్పడు వెబ్ సిరీస్‌లలోనూ కూడా నటిస్తున్నాడు రాజా.. ఆయ‌న చివ‌రిసారిగా భానుమ‌తి రామ‌కృష్ణ మూవీలో న‌టించారు. ఇక ఇది ఇలా ఉండే తాజాగా రాజా చెంబోలు త‌న నిశ్చితార్థం జ‌రిగిన‌ట్లు శ‌నివారం సోష‌ల్ మీడియాలో వెల్లడించారు. త‌న ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు..

"ఇది 2020లోనే బెస్ట్ పార్ట్‌. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృత‌జ్ఞత‌లు" అని రాసుకొచ్చారు రాజా.. అయితే తనకి కాబోయే భార్య పేరును మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ఈ జంట ఒకటి కానుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లు కూడా జంట బాగుందని కామెంట్స్ పెడుతున్నారు.



Krishna

Krishna

Next Story