Dhanush: వంద కోట్ల క్లబ్లో చేరిపోయిన ధనుష్ "సర్"

* అద్భుతమైన కలెక్షన్లతో 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన ధనుష్

Dhatripriya
Updated on: 6 March 2023 4:30 PM IST
Sir Movie Joins In Hundred Crore Club
X

వంద కోట్ల క్లబ్లో చేరిపోయిన ధనుష్ "సర్"

Sir Movie: కోలివుడ్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. నిన్న మొన్నటిదాకా డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ధనుష్ తాజాగా ఇప్పుడు తన కెరియర్ లోనే మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ "వాతి" / "సర్" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

తెలుగు - తమిళ్ బై లింగువాల్ సినిమా గా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో కనిపించారు. సాయికుమార్, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా వారాంతంలో మాత్రమే కాక వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్లు అందుకుంది. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా బాగుండడంతో ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది.

విడుదలైన కొద్ది రోజుల్లోనే "సార్" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ఆధారంగా ఈ సినిమా కథ నడుస్తుంది. ధనుష్ ఈ సినిమాలో ఒక పెద్ద కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా కనిపించారు. చదువు గొప్పతనం మరియు పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు పడే కష్టాలని ఈ సినిమాలో డైరెక్టర్ వెంకీ అట్లూరి హైలైట్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story