సింగర్‌ సునీత నిశ్చితార్థం ..

సింగర్‌ సునీత నిశ్చితార్థం ..
x
Highlights

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత.

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత. టాలీవుడ్ డిజిట‌ల్ రంగంలో వ్యాపారవేత్తగా ఉన్న రామ్‌ వీరపనేనితో ఈ రోజు (సోమవారం) ఉదయం సింగర్ సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఈ వేడుకని నిర్వహించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 19 ఏళ్ల వయసులోనే సునీతకు కిరణ్ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే భర్త తీరుతో విసిగిపోయన సునీత భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories