Shreya Ghoshal: శ్రేయ పదేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది

Shreya Ghoshal: వైరల్ అవుతున్న పదేళ్ల నాటి ట్వీట్

admin1
Updated on: 4 Dec 2021 8:30 PM IST
Singer Shreya Ghoshal
X
శ్రేయ ఘోషల్ అండ్ పరాగ్ అగర్వాల్ (ఫైల్ ఇమేజ్)

Shreya Ghoshal: ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియామకం పై ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌ సోషల్ మీడియా లో స్పందించారు. పరాగ్‎కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు పరాగ్ అగర్వాల్‌ కు శ్రేయా ఘోషల్‌కు మధ్య అనుబంధాన్ని చూడాలని ఆమె ట్విట్టర్ ను సోదా చేశారు. అయితే శ్రేయా ఘోషల్‌ పదేళ్ల కిందట చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. "బచ్‌పన్ కా దోస్త్ (బాల్య స్నేహితుడు)" అగర్వాల్‌ను ఫాలో అవ్వండి. తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి ప్లీజ్" అంటూ శ్రేయ ఘోషల్ నెటిజన్లను కోరింది.

ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో మళ్లీ నెటిజన్ల పై రియాక్ట్ అయ్యింది శ్రేయ ఘోషల్. "అరే యార్ ఎందుకు మీరు చిన్నప్పటి ట్వీట్లు బయటకి తీస్తున్నారు ??ట్విటర్ ఇప్పుడే ప్రారంభించబడింది. 10 సంవత్సరాల ముందు మేము చిన్నపిల్లలం! స్నేహితులు ట్విట్టర్ లో మాట్లాడుకోరా ఎంటి?" అంటూ ప్రశ్నించింది శ్రేయ. ఇక సీ ఈ ఓ గా పరాగ్ నియామకం పై శ్రేయ "పరాగా మీ గురించి చాలా గర్వంగా ఉంది!! ఈ వార్తను జరుపుకోవడం మాకు గొప్ప రోజు," అని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.


admin1

admin1

Next Story