Shreya Ghoshal Son: మాటల్లో చెప్పలేని ప్రేమ.. శ్రేయా ఘోషల్ ఎమోషనల్ ట్వీట్

Shreya Ghoshal Son: ఇది మాటల్లో చెప్పలేని ప్రేమంటూ.. తన కొడుకుని ప్రపంచానికి పరిచయం చేస్తూ... ఎమోషనల్ అయింది శ్రేయా ఘోషల్.

Venkata Chari
Updated on: 2 Jun 2021 4:26 PM IST
Singer Shreya Ghoshal Shares First Photo of her Son Devyaan Mukhopadhyaya on Social Media
X

శ్రేయా ఘోషల్ (ఫొటో ట్విట్టర్)

Shreya Ghoshal: ఇది మాటల్లో చెప్పలేని ప్రేమంటూ.. తన కొడుకుని ప్రపంచానికి పరిచయం చేస్తూ... ఎమోషనల్ అయింది శ్రేయా ఘోషల్. మే 22న తల్లిగా మారిన సింగర్ శ్రేయా ఘోషల్.. తాజాగా తన కొడుకు పేరు వెల్లడిస్తూ ట్విట్టర్ లో ఫొటో షేర్ చేసింది.

ఈ ఫొటోలో.. చేతిలో తన బిడ్డను పట్టుకుని భర్తతో ఆనందం షేర్ చేసుకుంటూ కనిపించారు. 'ఆ దేవుడి ఆశీర్వాదంతో పండంటి మ‌గ‌బిడ్డ పుట్టాడు. తన భర్త శైలాదిత్య‌, నేను, కుటుంబ స‌భ్యులం అంద‌రం చాలా హ్యాపీగా ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేని ఫీలింగ్ ఇది. ఆశీర్వాదాలు పంపిన అంద‌రికీ హృదయపూర్వక ధ‌న్య‌వాదాలంటూ' ట్విట్టర్లో రాసుకొచ్చింది శ్రేయా ఘోషల్. అలాగే తన కొడుకు పేరు దేవయాన్ ముఖోపాధ్యాయ అని చెప్పింది.


Venkata Chari

Venkata Chari

Next Story