Renuka Panwar: యూట్యూబ్‌లో పాట.. 105 కోట్ల వ్యూస్‌

Renuka Panwar: యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ వస్తే గొప్ప అనుకుంటాం పది మిలియన్ల వ్యూస్‌ వస్తే వారెవ్వా అంటాం.

Arun Chilukuri
Updated on: 7 July 2021 3:16 PM IST
Singer Renuka Panwar has Become a Social Media Sensation
X

Renuka Panwar: యూట్యూబ్‌లో పాట.. 105 కోట్ల వ్యూస్‌

Renuka Panwar: యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ వస్తే గొప్ప అనుకుంటాం పది మిలియన్ల వ్యూస్‌ వస్తే వారెవ్వా అంటాం.. అలాంటిది వంద కోట్ల వ్యూస్‌ దాటితే.. అదీ ఏ పాపులారిటీ లేని ఓ సింగర్‌ పాడింది అయితే. అవును ఓ పంతొమ్మిదేళ్ల భారత అమ్మాయి ఇప్పుడు తన సాంగ్‌తో ప్రపంచాన్ని ఊపేస్తోంది.

పదో తరగతిలో సున్‌ సోనియో సాంగ్‌తోనే అందరిని ఫిదా చేసిన రేణుకా పన్వర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని భేకరాలో జన్మించింది. తొలి పాటతో వచ్చిన ప్రోత్సాహంతో ఖుదా కీ ఇనాయత్‌ హై అనే సాంగ్‌ యూట్యూబ్‌లో వదిలి కుర్రకారును మైమరపించింది. అక్కడ నుంచి పలు పాటల్ని రిలీజ్ చేసిన రేణుక 5 లక్షల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. తొమ్మిది నెలల క్రితం బావన్‌ గజ్‌కా దమన్‌ అనే పాటను రిలీజ్ చేయగా ఇప్పుడు ఆ పాట 105 కోట్ల వ్యూస్‌ దాటి రికార్డు సృష్టించింది. పాటలోనే కాదు ఆటలోనూ రేణుక తన మార్క్‌ చూపింది. ఇండియన్ బెస్ట్‌ డ్యాన్సింగ్ స్టార్‌లో పాల్గొని టైటిల్‌ కూడా దక్కించుకుంది ఈ పంతొమ్మిదేళ్ల యువతి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story