ప్రముఖ సింగర్ కు కారు ప్రమాదం.. గీతా మాధురి ఎమోషనల్ రియాక్షన్..

Rakshita Suresh: ప్రముఖ సింగర్ రక్షిత సురేష్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 8 May 2023 11:40 AM IST
Singer Rakshita Suresh Meets With an Accident, Geetha Madhuri Emotionalised
X

ప్రముఖ సింగర్ కు కారు ప్రమాదం.. గీతా మాధురి ఎమోషనల్ రియాక్షన్..

Rakshita Suresh: ప్రముఖ సింగర్ రక్షిత సురేష్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలేషియాలో పని ముగించుకొని భారత్ కు తిరిగివచ్చేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రక్షిత సురేష్ తో సహా కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని రక్షిత స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడించింది.

ప్రమాదం జరిగిన సమయంలో తన జీవితం మొత్తం కళ్ల ముందు రెండు సెకన్లలో కనిపించిందని..అయితే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని రక్షిత తెలిపింది. యువ గాయనిగా రక్షిత సురేష్ సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రక్షిత తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గాయనిగా సత్తా చాటుకుంటున్నారు.

రీసెంట్ గా పీఎస్2 కోసం కన్నడలో ఒక పాట పాడింది. రక్షిత తెలుగు సంగీత అభిమానులకు సైతం సుపరిచితురాలే. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చల్ల గాలి సాంగ్ పాడింది. నాగచైతన్య లవ్ స్టోరీలో ముత్యాల చెమ్మచెక్కా పాట పాడింది. రక్షిత కారు ప్రమాదం గురించి తెలుసుకొని ఆమె అభిమానులు ఉలిక్కి పడ్డారు. అయితే స్వల్ప గాయాలతో తప్పించుకుందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రముఖ సింగర్ గీతా మాధురి సైతం యాక్సిడెంట్ పై రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ గాడ్..నీవు త్వరగా కోలుకోవాలని కామెంట్ పెట్టింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story