Singer KK: సింగర్‌ కేకే తెలుగులో పాడిన హిట్‌ సాంగ్స్‌ ఇవే..

Singer KK: ప్రముఖ పాపులర్ సింగర్ కృష్ణకుమార్‌ కున్నత్‌ అలియాస్‌ కేకే ఈ లోకాన్ని వీడిపోయారు.

Arun Chilukuri
Published on: 1 Jun 2022 3:13 PM IST
Singer KK Telugu Latest Hit Songs
X

Singer KK: సింగర్‌ కేకే తెలుగులో పాడిన హిట్‌ సాంగ్స్‌ ఇవే..

Singer KK: ప్రముఖ పాపులర్ సింగర్ కృష్ణకుమార్‌ కున్నత్‌ అలియాస్‌ కేకే ఈ లోకాన్ని వీడిపోయారు. ఆరాధ్య దైవమైన గానం అనే వృత్తిలో లీనమైన సమయంలోనే దిగంతాలకు వెళ్లిపోయారు. ప్రముఖ గాయకుడిగా దేశ ప్రజలందరి చేత ప్రశంసలందుకుంటున్న వేళ 53 ఏళ్లకే శాశ్వతంగా కన్నుమూయడం అభిమానులను బాధిస్తోంది.హిందీలో ఎన్నో పాటలు పాడి స్టార్‌ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, అస్సాం, గుజరాతీ.. ఇలా పలు భాషల్లో మనసుని హత్తుకునేలా, యువతను ఉర్రూతలూగించేలా పాటలు పాడారు. ఇక, తెలుగులో అయితే ఆయన పాడిన ఎన్నో పాటలు సూపర్‌హిట్స్‌ అందుకున్నాయి.

కృష్ణకుమార్‌ కున్నత్‌ ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ప్రేమ దేశం చిత్రంలో ప్లేబ్యాక్‌ సింగర్‌గా పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో కాలేజీ స్టైలే, హలో డాక్టర్‌ పాటలు ఆలపించగా.. రెండు సూపర్‌ హిటయ్యాయి. ఇంద్రా, సంతోషం, ఘర్షణ, గుడుంబా శంకర్‌, నువ్వేనువ్వే, సైనికుడుతో పాటు పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఇద్రా చిత్రంలో 'దాయి దాయి దామ్మా', నేనున్నాను చిత్రంలో 'ఐ ఆమ్‌ వెరీ సారీ', ఘర్షణలో 'చెలియ చెలియ', వాసులో 'పాటకు ప్రాణం', ఖుషిలో 'యే మేరా జహ', నువ్వునేను చిత్రంలో 'నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన', నా ఆటోగ్రాఫ్‌ చిత్రంలో 'గుర్తుకొస్తున్నాయి', ఆర్యలో 'ఫీల్‌ మై లవ్‌', 'జల్సా'లో మై హార్ట్‌', లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌', 'ప్రేమకావాలి'లో 'మనసంతా ముక్కలు చేసి' తదితర ఎన్నో తెలుగు హిట్‌ పాటలను కేకే ఆలపించారు. ఆయన మృతికి పలువురు తెలుగు సంగీత దర్శకులు సంతాపం ప్రకటించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story