Chinmayi Sripada: సరోగసి వార్తలపై మండిపడ్డ చిన్మయి

Chinmayi Sripada: సరగసి వార్తలపై మండిపడ్డ చిన్మయి

Rama Rao
Updated on: 23 Jun 2022 12:56 PM IST
Singer Chinmayi Sripada Welcomes Twin Babies | Tollywood
X

Chinmayi Sripada: సరగసి వార్తలపై మండిపడ్డ చిన్మయి

Chinmayi Sripada: డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మరియు సింగర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా ఈమె తాను కవలలకు జన్మనిచ్చినట్లుగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని వారి పేర్లు ద్రిప్త మరియు శర్వస్ అని కూడా ప్రకటించింది.

కానీ ఇప్పటి దాకా తాను గర్భవతి అనే విషయం ఎవరికీ తెలీదు. ఈ నేపథ్యంలో ఆమె సరోగసి ద్వారా పిల్లల్ని కని ఉంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. తాజాగా ఈ పుకార్లపై ఘాటుగా రియాక్ట్ అయ్యింది చిన్మయి."నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫోటోలు ఏవి పోస్ట్ చేయలేదు కాబట్టి నేను సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన అని కొందరు అంటున్నారు.

కానీ నేను గర్భవతిని అనే విషయం కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. నేను కేవలం నన్ను నేను కాపాడుకుంటాను. నా వ్యక్తిగత జీవితం, కుటుంబం, సన్నిహితులను బహిర్గతం చెయ్యను. కొన్నాళ్లపాటు మా పిల్లల ఫోటోలు కూడా సోషల్ మీడియాలోకి రావు" అని క్లారిటీ ఇచ్చింది చిన్మయి. తనకు సిజేరియన్ జరుగుతున్న సమయంలో భజన పాటలు పాడానని, దాని గురించి త్వరలో అప్డేట్ కూడా ఇస్తానని చెప్పుకోచ్చింది చిన్మయి.

Rama Rao

Rama Rao

Next Story