మనోపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు

మనోపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు
x
Highlights

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, తెలుగు, తమిళ ప్రేక్షకులకు చేరువైన సింగర్ చిన్మయి.

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, తెలుగు, తమిళ ప్రేక్షకులకు చేరువైన సింగర్ చిన్మయి. కాగా.. ఇటీవలి కాలంలో సింగర్ చిన్మయి `మీటూ` ఆరోపణలతో సంచలనం సృష్టించింది. తమిళ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే సింగర్ కార్తిక్ వేధింపుల గురించి కూడా చిన్మయి ప్రస్తావించారు.

సింగర్ కార్తిక్‌కు మనో మద్దతు కారణంగా తమిళనాడు డబ్బింగ్ యూనియన్‌లో చోటు లభించింది. మనోపై గాయని చిన్మయి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తనకు కార్తీక్ రాజీ కుదర్చడానికి ప్రయత్నించారని తెలిపారు. ఈ వీడియోలో 'కొన్ని రోజుల క్రితం సింగర్‌ మనో గారు నాకు ఫోన్‌ చేసి.. తన ఇంటికి రమ్మని కార్తీక్‌ పై ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారిని తన దగ్గరకు తీసుకురావాలని చెప్పారు. కార్తీక్‌ భార్య గర్భవతి ఆమె బాధపడుతోంది. వేధిపులు పేరుతో తన కెరీర్‌ను ఎందుకు నాశనం చేస్తున్నావు..? ఈ స్థాయికి రావడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. అలాగే కార్తీక్‌ కూడా ఎంతో కష్టపడ్డాడు.' చెప్పారు.

ఈ సందర్భంగా కార్తీక్‌ అంటే తనకు గౌరవం ఉందని, కార్తిక్ ఎంతో కష్టపడి స్థాయికి వచ్చారు. తాను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మంచి స్తాయికి వచ్చాను. కానీ., అయితే ఈ స్థాయికి వచ్చాక నేను ఎవరిని వేధింలేదని పేర్కొన్నారు. ఏడాదిన్నరలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నా. అని చిన్మయి పేర్కొన్నారు.

కార్తీక్‌, మనో మంచి సింగర్సే కానీ మంచి గొప్ప వ్యక్తులు కాదంటూ ఆమె ఆరోపించారు. సింగర్‌ కార్తీక్‌ వేధింపులకు గురి చేస్తున్నాడని సోషల్‌మీడియా వేదికగా చిన్మయి ఆరోపణలు కోలీవుడ్‌లో పెద్ద సంచలనం రేపాయి. ఆ తర్వాత కోలీవుడ్‌లో జరిగిన పరిణామాలు గురించి తెలిసిందే. మనో కార్తీక్ మంచి గాయకులే కానీ గొప్ప మనుషులు కాదు అంటూ చిన్మయి చేసిన వ్యాఖ్యలపై మరింత దుమారం రేపనున్నాయి. అయితే దీనిపై మనో ఎలా స్పందిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories