Singeetam Srinivasa Rao: ప్రభాస్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు

Singeetam Srinivasa Rao: "ప్రాజెక్ట్ కే" విషయంలో తన ఇన్వాల్వ్ అయింది అందుకే అంటున్న డైరెక్టర్

Jyothi
Published on: 9 Sept 2022 10:55 AM IST
Singeetham Srinivasa Rao Gave Clarity About Prabhas Movie
X

Singeetam Srinivasa Rao: ప్రభాస్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు

Singeetam Srinivasa Rao: ఈ మధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఇప్పుడు కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే" సినిమాలలో కూడా నటించనున్నారు. "మహానటి" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాగ్ అశ్విన్ మరియు ప్రభాస్ కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న మొదటి సినిమా ఇది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే సినిమా స్క్రిప్ట్ విషయంలో సహాయం చేయమని నాగ్ అశ్విన్ ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ను కోరారట. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ ఏమాత్రం నచ్చని సింగీతం శ్రీనివాసరావు కథలో చాలా మార్పులు చేర్పులు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దీని గురించి క్లారిటీ ఇచ్చారు సింగీతం శ్రీనివాసరావు. నాగ్ అశ్విన్ కోరగా తాను సినిమా స్క్రిప్ట్ లో తన ఇన్పుట్స్ మరియు సజెషన్స్ మాత్రమే ఇచ్చానని వారిద్దరికీ మధ్య ఎటువంటి గొడవలు జరగలేదని తాను కేవలం స్క్రిప్ట్ విషయంలో తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను అని స్పష్టం చేశారు సింగీతం శ్రీనివాసరావు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Jyothi

Jyothi

Next Story