Sidhu Jonnalagadda: క్రేజీ కాంబో రిపీట్.. సిద్ధు జొన్నలగడ్డ – నాగవంశీ కొత్త సినిమా షురూ!

Sidhu Jonnalagadda: క్రేజీ కాంబో రిపీట్.. సిద్ధు జొన్నలగడ్డ – నాగవంశీ కొత్త సినిమా షురూ!
x
Highlights

Siddu Jonnalagadda: టాలీవుడ్ ‘స్టార్ బాయ్’ సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు.

Siddu Jonnalagadda: టాలీవుడ్ ‘స్టార్ బాయ్’ సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ యంగ్ హీరో, ఇప్పుడు మరో టాలెంటెడ్ డైరెక్టర్‌తో జతకట్టాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి కల్ట్ క్లాసిక్ హిట్ అందించిన స్వరూప్ RSJ దర్శకత్వంలో సిద్ధూ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు.

పవర్‌ఫుల్ కాన్సెప్ట్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించింది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేసిన ఈ కాన్సెప్ట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్టర్‌లో ఒక పల్లెటూరి వాతావరణం కనిపిస్తుండగా, దాని వెనుక ఒక భారీ మెషిన్ గన్ ఉండటం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇది కేవలం కామెడీ చిత్రమే కాదు, ఏదో బలమైన యాక్షన్ లేదా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న సినిమా అని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

స్వరూప్ RSJ తన మొదటి సినిమాతోనే డిటెక్టివ్ థ్రిల్లర్ జోనర్‌లో కొత్త ఒరవడిని సృష్టించారు. ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డకు ఉన్న మాస్ ఇమేజ్, టైమింగ్‌కు స్వరూప్ మార్క్ మేకింగ్ తోడైతే వెండితెరపై మ్యాజిక్ ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం సిద్ధూ తన చేతిలో ఉన్న ఇతర ప్రాజెక్టులను (టిల్లు క్యూబ్ వంటివి) పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అవి పూర్తయిన వెంటనే స్వరూప్ దర్శకత్వంలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories