Siddharth: ఆ ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్

Siddharth: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన కొన్ని గంటలకే సమంత...

admin1
Published on: 9 Oct 2021 4:18 PM IST
Siddharth Reacts on His Viral Cheaters Tweet
X

Siddharth: ఆ ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్

Siddharth: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన కొన్ని గంటలకే సమంత మాజీ ప్రియుడైన హీరో సిద్ధార్థ్ ఒక వివాదాస్పద ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. "నేను స్కూల్లో మా టీచర్ల దగ్గర నుంచి నేర్చుకున్న మొట్టమొదటి లెసన్ 'మోసం చేసే వాళ్ళు ఎప్పటికీ సుఖపడరు'" అని సిద్ధార్థ్ ట్వీట్ చేయగా అది సమంత గురించి చేశారని చాలామంది చెప్పుకొచ్చారు. తాజాగా "మహాసముద్రం" ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్న సిద్ధార్థ్ కు ఈ ప్రశ్న ఎదురైంది.

సడన్ గా ఆ ట్వీట్ రావడానికి గల కారణం ఏంటని అడగగా తాను ట్విట్టర్లో 12 ఏళ్ల నుంచి ఉన్నానని ఉదాహరణకి తన ఇంటిముందు చాలా కుక్కలు ఉన్నాయి అని ట్వీట్ చేస్తే నన్ను కుక్క అంటావా అని అనడంలో అర్థం లేదని ఎందుకంటే ఆయన ఇంటిముందు నిజంగానే కుక్కలు ఉన్నాయి అని అన్నారు. ఇక అంతకు ముందు రోజు కూడా తాను ఒక ట్వీట్ చేశానని కానీ దాని గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు. కానీ ఆయన ట్వీట్ చేసిన రోజే సమంత కూడా తన విడాకుల ని ప్రకటించారని అడగగా, సిద్ధార్థ్ తను కేవలం తన జీవితం గురించి మాత్రమే మాట్లాడతాను అని దానికి తనకు ఏం సంబంధం లేదని అన్నారు.

admin1

admin1

Next Story