Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్

Siddharth and Aditi Rao Hydari: వనపర్తి గుళ్లో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితిరావు హైదరి

Shashank Gullapelli
Published on: 27 March 2024 9:14 PM IST
Siddharth And Aditi Rao Hydari Secretly Married In Temple
X

Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్ 

Siddharth and Aditi Rao Hydari: నటుడు సిద్ధార్థ్ సీక్రెట్ గా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్, అదితిరావుహైదరి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. సిటీకి దూరంగా ఉన్న గుళ్లో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. సినిమా హీరో, హీరోయిన్ పెళ్లంటే.. సెట్టింగులు, హంగులు ఆర్భాటాలు ఉంటాయని అనుకున్నారంతా.. కానీ.. సదాసీదాగా.. పల్లెటూరిలో ఓ ఆలయంలో చాలా సింపుల్‌గా పె‌ళ్లి తంతును ముగించారు.

అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్, అదితిరావుహైదరి కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం ప్రేమ పావురాలుగా మారి పలు దేశాల్లో చక్కర్లు కొట్టారు.. అడపాదడపా.. కనిపించినా.. సినిమా షూటింగ్‌ అని కవర్ చేశారు. కానీ తాజాగా జరిగిన పరిణామంతో హీరో, హీరోయిన్ల ప్రేమ వ్యవహారం బయటపడింది.

కొన్నిరోజులుగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్, అదితీరావు హైదరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారనే న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండలంలోని శ్రీరంగనాథుని ఆలయంలో సిద్ధార్థ్, అదితీ రావు హైదరీలు పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితీ రావు హైదరీ ఒకరుగా ప్రచారంలో ఉంది. అయితే మూవీ షూటింగ్ కోసం వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నా.. కొందరు మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తున్నారు. రాత్రికి రాత్రే పెళ్లి కోసం శ్రీరంగనాథుని ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజామున వివాహ తంతును ఆలయ అర్చకులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి పూర్తయ్యే వరకు ఆలయం లోపలికి ఎవరినీ అనుమతించలేదని సమాచారం. వివాహం పూర్తయిన తర్వాత చాలా సీక్రెట్ గా సిద్ధార్థ్, అదితీ రావు హైదరీ అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story