ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన కృష్ణం రాజు శ్రీమతి

ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన కృష్ణం రాజు శ్రీమతి
x
Highlights

టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ పేరు మొదటి గా ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే మనం చాలా...

టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ పేరు మొదటి గా ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే మనం చాలా వార్తలు వింటూనే ఉన్నాం. అయితే 'బాహుబలి' సినిమా అయిపోగానే ప్రభాస్ పెళ్లి అనుకుంటే, 'సాహో' సినిమా మొదలు పెట్టాడు ప్రభాస్. అయితే తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా కృష్ణం రాజు గారి శ్రీమతి శ్యామల దేవి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సమయంలో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన కూడా రావడంతో ఆమె ఇలా స్పందించారు.

"ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన పుకార్ల లో ఎంత మాత్రం నిజం లేదు. ప్రభాస్ పెళ్లి పై వచ్చిన వార్తలను మేము సరదాగా తీసుకుంటాం కానీ పెద్దగా పట్టించుకోము. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ సినిమాలు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మాది చాలా పెద్ద కుటుంబం అందరం కలిసి పోయి ఆప్యాయంగా ఉంటాం. అలా అందరితో కలిసిపోయే అమ్మాయి ప్రభాస్ కు భార్య గా రావాలని కోరుకుంటున్నాము" అని చెప్పుకొచ్చారు శ్యామలాదేవి.

Show Full Article
Print Article
Next Story
More Stories