Shyam Singha Roy: భారీ మొత్తానికి అమ్ముడైన "శ్యామ్ సింగరాయి" హిందీ రైట్స్

Shyam Singha Roy Hindi Rights Sold for 10 Crores
x

భారీ మొత్తానికి అమ్ముడైన "శ్యామ్ సింగరాయి" హిందీ రైట్స్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Shyam Singha Roy: హిందీ రైట్స్ తోనే 10 కోట్లు వసూలు చేసిన నాని

Shyam Singha Roy: ఈ మధ్యనే తన "టక్ జగదీష్" సినిమాని ఓటీటీ లో విడుదల చేసిన నాని ఈ సినిమాతో పెద్ద డిజాస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "శ్యామ్ సింగరాయి" పైనే పెట్టుకున్నాడు నాని. నాని కరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనున ఈ సినిమాలో "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో అలరించనున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తాజాగా బి ఫోర్ యూ ఛానల్ వారు ఈ చిత్ర హిందీ రైట్స్ ని భారీ వ్యయంతో కొనుకున్నారట. కేవలం హిందీ రైట్స్ కోసం ఈ ఛానల్ వారు నిర్మాతలకి 10 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా నాని కెరీర్ లో ఇంత పెద్ద మొత్తానికి హిందీ రైట్స్ కొనుగోలు అవ్వడం ఇదే మొదటిసారి. "టాక్సీవాలా" ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories