"సలార్" సినిమాలో శ్రుతిహాసన్ పాత్ర అదేనా?

"సలార్" సినిమాలో శ్రుతిహాసన్ పాత్ర అదేనా?

admin1
Updated on: 17 March 2022 4:30 PM IST
Shruti Hassan Role in Salaar Movie | Telugu Online News
X

"సలార్" సినిమాలో శ్రుతిహాసన్ పాత్ర అదేనా? 

Shruti Hassan: ఈ మధ్యనే "రాధేశ్యామ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ దశాబ్ద కాలంలో తన కరియర్ లో మొట్టమొదటి డిజాస్టర్ ను అందుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "సలార్". కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ పొలిటికల్ ఎంటర్టైనర్గా మాఫియా బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో శ్రుతిహాసన్ పాత్ర గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం శ్రుతిహాసన్ ఈ సినిమాలో ఒక జర్నలిస్టు పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. హీరో జీవితం గురించి శృతి హాసన్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తుందని తర్వాత అతనితో ప్రేమలో పడి అతనితో పాటు క్రైమ్స్ చేస్తూ ఉంటుందని సమాచారం. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి బాగా ప్రాధాన్యత ఉంటుందని ఈ సినిమాలో శృతి హసన్ కొన్ని యాక్షన్ సన్నివేశాలలో కూడా నటిస్తుందని తెలుస్తోంది. ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న శృతిహాసన్ కి ఈ సినిమా మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

admin1

admin1

Next Story