మళ్ళీ వెండితెరపై మెరవనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

Ruthvik
Published on: 25 March 2019 1:29 PM IST
మళ్ళీ వెండితెరపై మెరవనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్
X

లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా కాకుండా స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, శృతి హాసన్ 'కాటమరాయుడు' సినిమా తరువాత మళ్ళీ తెలుగు తెరపై మెరిసింది లేదు. గత రెండేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటూ లండన్లో తన సింగింగ్ కెరీర్ పైన ఫోకస్ పెట్టింది శృతి. అక్కడ కూడా వర్క్ అవుట్ కాకపోవడంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. తన ప్రియుడు మైఖేల్ తో తెగదెంపులు చేసుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ బ్రేకప్ సంగతిపై క్లారిటీ లేదు కానీ రీ-ఎంట్రీ మాత్రం కన్ఫామ్ అనే తెలుస్తోంది. తాజాగా ఈమె ఒక ఫోటో షూట్ లో పాల్గొనడమే దానికి ఉదాహరణ.

ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం రెడ్ కలర్ థై స్లిట్ డ్రెస్ సెక్సీ గా ఫోటోలకు పోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. తనదైన స్టైల్ లో నవ్వుతూ క్లీవేజ్ అందాలను అరబోసింది. శృతి ఫిట్నెస్ చూస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్ కోసం ముహుర్తాలు కూడా ఫిక్స్ అయిపోయాయి అన్నట్టు ఉంది. సినిమాల నుండి గ్యాప్ వచ్చినప్పటికీ, ఇప్పటికీ మంచి ఆఫర్లు వస్తున్నాయట. తమిళంలో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని కూడా తెలుస్తోంది. అతిత్వరలో శృతి ని వెండి తెరపై చూడచ్చని ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు.

Ruthvik

Ruthvik

Next Story