Shruti Haasan: "తనతో సమయం గడపడం చాలా ఇష్టం" అంటున్న శ్రుతి హాసన్

Shruti Haasan: ఈ మధ్యనే సినిమాలనుంచి చిన్న బ్రేక్ తీసుకున్న శృతిహాసన్ తాజాగా "క్రాక్" సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

admin1
Published on: 30 Aug 2021 4:06 PM IST
Shruti Haasan Talks About Her Boyfriend Santanu Hazarika
X

Shruti Haasan: "తను నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే" అంటున్న శ్రుతి హాసన్ 

Shruti Haasan: ఈ మధ్యనే సినిమాలనుంచి చిన్న బ్రేక్ తీసుకున్న శృతిహాసన్ తాజాగా "క్రాక్" సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది మొదట్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయిన శృతిహాసన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. గత కొంతకాలంగా ఈమె శాంతనూ హజారికా అనే అతనితో ప్రేమలో ఉందని త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ విషయమై అడగగా శృతిహాసన్ తన దగ్గర ఎలాంటి రహస్యాలు లేవని చెప్పుకొచ్చింది.

పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే మరుక్షణమే అది అందరికీ చెప్పేస్తానని, ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని చెప్పింది శృతిహాసన్. అంతేకాక పుకార్లకు చెక్ పెడుతూ, " శాంతనూ నా బెస్ట్ ఫ్రెండ్. తను ఒక ప్రతిభగల ఆర్టిస్ట్. సంగీతం, కళలు, సినిమాల విషయాలలో మా అభిప్రాయాలు చాలా బాగా కలిశాయి. తనతో కలిసి సమయం గడపడం నాకు చాలా ఇష్టం. తనంటే నాకు చాలా గౌరవం కూడా" అని చెప్పింది శృతి హాసన్. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" సినిమాతో బిజీగా ఉన్న శృతిహాసన్, ప్రభాస్ రోజు పంపే వంటకాలను చూసి తనను తాను నియంత్రించుకోలేక పోతున్నానని, ఇప్పటిదాకా ప్రభాస్ ఆతిథ్యం గురించి విన్న తనుకు ఈ సినిమా ద్వారా అనుభవంలోకి వచ్చిందని చెప్పింది.

admin1

admin1

Next Story