Shruti Haasan: ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన శృతి హాసన్

Shruti Haasan: "3" థియేటర్ లకు వచ్చి మరీ సందడి చేసిన శృతి హాసన్

Jyothi
Published on: 10 Sept 2022 2:07 PM IST
Shruti Haasan Shocked the Fans
X

Shruti Haasan: ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన శృతి హాసన్ 

Shruti Haasan: ఈమధ్య కాలంలో ఫ్యాన్స్ అందరూ తమ అభిమాన తారల సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తూ వాటి కలెక్షన్లు చూసి సంతోషిస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి అభిమానుల తర్వాత ధనుష్ అభిమానులు కూడా అదే బాటలో వెళ్ళారు. ధనుష్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన "3" సినిమాను రీ రిలీజ్ చేశారు. అయితే సినిమాను మళ్లీ చూడటానికి థియేటర్ లకు వచ్చిన అభిమానులకు శృతి హాసన్ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. గురువారం నాడు "3" సినిమా ప్రసారమవుతోన్న ఒక థియేటర్‌లో శృతి హాసన్‌ సందడి చేసింది.

అప్పటి వరకు వెండి తెరపై కనిపించిన హీరోయిన్ ఒక్కసారిగా ప్రత్యక్షంగా దర్శనమివ్వడంతో ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. అభిమానులను పలకరించడం మాత్రమే కాక "కన్నులదా" పాట కూడా పాడారు శృతి. ప్రేక్షకులు సైతం శృతీకి తోడై పాటను పాడేసారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోకు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 2012లో విడుదలై హిట్ అయిన "3" సినిమా నుండి "వై దిస్‌ కొలవెరి" సాంగ్‌ ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయింది. తాజాగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో విడుదల అయినప్పటికీ 150 షోలు హౌజ్‌ ఫుల్‌ అయ్యాయి.

Jyothi

Jyothi

Next Story