Shruti Haasan: ప్రేమలో ఉండటం ఎప్పుడూ బాగుంటుంది అంటున్న శృతిహాసన్

* ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ లతో కలిసి వర్క్ చేయడం తనకి చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.

admin1
Updated on: 11 Oct 2021 1:13 PM IST
Shruti Haasan says that it is always Happy to be in Love
X

శృతి హాసన్ (ఫైల్ ఫోటో)

Shruti Haasan: స్టార్ బ్యూటీ శృతిహాసన్ ఏ విషయంలో అయినా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది కానీ గత కొంతకాలంగా ఆమె తన వ్యక్తిగత విషయాలు మాత్రం సీక్రెట్ గా ఉంచుతుంది. "నేను పుట్టినప్పటి నుంచి నా గురించి ప్రతిదీ పబ్లిక్ అవుతూనే ఉంటుంది. కనీసం మా అమ్మానాన్న కలిసి కనిపించినా సరే అది న్యూస్ అవుతూ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన జీవితం దొరకడం నా అదృష్టం.

అందరి లాగా నేను కూడా మాట్లాడతాను, ఫ్రెండ్స్ చేసుకుంటాను, గొడవ పడతాను కానీ నేను ఎప్పుడు కనిపించినా నన్ను అడిగే ప్రశ్నల్లో మొదటిది నా పెళ్లి గురించి" అని చెప్పింది శృతి హాసన్.

"బాయ్ ఫ్రెండ్ తో జీవితం ఎలా ఉంది అని అడుగుతారు. ప్రేమలో ఉండటం ఎప్పుడూ బాగానే ఉంటుంది. అది అన్నిటికంటే బెస్ట్ ఫీలింగ్. బ్రేకప్ కూడా బాగుంటుంది. ఎందుకంటే నాకు చాలా మంచి పాటలు వస్తాయి," అని నవ్వేసింది శృతి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సినిమా బోలెడు భాషల్లో విడదల కాబోతోందని, ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ లతో కలిసి వర్క్ చేయడం తనకి చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.

admin1

admin1

Next Story