Shruti Haasan: మొదట తిరస్కరించినా మళ్లీ ఒప్పుకున్న శృతి హాసన్

Shruti Haasan: మొదట తిరస్కరించినా మళ్లీ సినిమా చేసెందుకు ఒప్పుకున్న శృతి హాసన్

admin1
Updated on: 27 Oct 2021 8:31 PM IST
Shruti Haasan Says ok to Bala Krishna Movie
X
బాలకృష్ణ సినెమలి ఓకే చెప్పిన శృతి హాసన్ (ఫైల్ ఇమేజ్)

Shruti Haasan: స్టార్ బ్యూటీ శృతిహాసన్ ది గోల్డెన్ లెగ్ అని గోపీచంద్ మలినేని గట్టిగా నమ్ముతారు. దానికి కారణం గోపీచంద్ దర్శకత్వం వహించిన "బలుపు" మరియు "క్రాక్" సినిమాలలో శృతి హసన్ హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు అయిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మరియు శృతి హాసన్ ల మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. గోపీచంద్ మలినేని తన తదుపరి సినిమా కోసం కూడా శృతి హాసన్ ని హీరోయిన్ గా అడిగాడు. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కానీ శృతిహాసన్ ఈ సినిమాని సున్నితంగా తిరస్కరించింది. గోపీచంద్ మలినేని కూడా ఆమెను ఒప్పించలేకపోయాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం శృతిహాసన్ మళ్లీ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుందట. గోపీచంద్ మలినేని ఆఖరిసారిగా శృతిహాసన్ ని మళ్ళీ ఒకసారి అడగడానికి ఆమెను సంప్రదించారు. అప్పుడు సినిమా చేసేందుకు శృతి ఒప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే శృతిహాసన్ కోసం భారీ రెమ్యునరేషన్ ని ఆఫర్ చేశారని అందుకే ఆమె అంత తొందరగా సినిమాకి ఒప్పుకుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం క్రాక్, బలుపు వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు స్వయంగా అడగటంతో ఆమె నో చెప్పలేకపోయిందని, అందుకే సినిమా చేసేందుకు ఒప్పుకుందని అంటున్నారు. ఏదేమైనా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది.

admin1

admin1

Next Story