Shruti Haasan: తన ప్రేమ విషయం పై రియాక్ట్ అయిన శృతి హాసన్

Shruti Haasan: తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతి హాసన్ శాంతను హజరిక గురించి, తమ ప్రేమ కథ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అందరితో పంచుకుంది.

admin1
Updated on: 21 Jan 2022 2:01 PM IST
Shruti Haasan Reacts to his Love Affair | Movie News Today
X

తన ప్రేమ విషయం పై రియాక్ట్ అయిన శృతి హాసన్

Shruti Haasan: సార్ బ్యూటీ శ్రుతి హాసన్ ముంబై కి చెందిన ఒక డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజరిక ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతి హాసన్ శాంతను హజరిక గురించి, తమ ప్రేమ కథ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అందరితో పంచుకుంది. సోషల్ మీడియాలో తన అభిమానులతో మాట్లాడుతున్న శృతిహాసన్ శాంతనూ తన కి 2018 నుంచి పరిచయం అని కానీ వారి ప్రేమ 2020 నుంచి మొదలైంది అని చెప్పుకొచ్చింది. నిజానికి 2018లో శృతిహాసన్ మైకేల్ కోర్సులే అనే వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉండేది. 2019 లోనే వారు విడిపోయారు. ఆ తర్వాత 2020 లో మొదట శాంతను హజరిక నే ఆమెకు ఐ లవ్ యు చెప్పాడట.

వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రొటెక్టివ్ గా ఉంటారు అని అడగగా ఇద్దరూ ఒకరిని ఒకరు పాయింట్ చేసుకున్నారు. ఇద్దరిలో ఎవరు ఆర్గుమెంట్ మొదలు పెడతారు అని అడగగా శృతిహాసన్ తనే అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇద్దరు ముంబైలోని ఒక అపార్ట్ మెంట్ తీసుకుని అందులో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యన "క్రాక్" సినిమాతో మంచి హిట్ అందుకున్న శృతి హాసన్ ఇప్పుడు ప్రభాస్ "సలార్" సినిమాతో బిజీ గా ఉంది. "కే జీ ఎఫ్" ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

admin1

admin1

Next Story