Shruti Haasan: చిరంజీవితో షూటింగ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసిన శృతిహాసన్..

Shruti Haasan: శృతిహాసన్ మరియు చిరంజీవికి మధ్య నిజంగానే విభేదాలు వచ్చాయా?

Jyothi
Updated on: 10 April 2023 2:00 PM IST
Shruti Haasan made Shocking Comments about Shooting with Chiranjeevi
X

Shruti Haasan: చిరంజీవితో షూటింగ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసిన శృతిహాసన్..

Shruti Haasan: ఈ మధ్యనే శృతి హాసన్ హీరోయిన్ గా మెగాస్టార్ చిరంజీవి సరసన "వాల్తేరు వీరయ్య" సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా సాంగ్ షూటింగ్ సమయంలో స్నో పడే ప్రదేశాల్లో తను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది శృతిహాసన్. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సినిమా గురించి షూటింగ్ గురించి మాట్లాడిన శృతిహాసన్ ఇప్పుడు దానివల్ల వివాదంలో ఇరుక్కుంది.

పాటల షూటింగ్స్ సమయంలో తనకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పిన శృతిహాసన్ హీరోలకి మాత్రం కోట్స్, షాల్స్ ఇస్తారని కానీ హీరోయిన్స్ మాత్రం కేవలం బ్లౌజు మరియు చీరలలో డాన్స్ లు వెయ్యాలని ఫైర్ అయింది. "వాల్తేరు వీరయ్య" సినిమాలో శ్రీదేవి చిరంజీవి పాట షూటింగ్ మంచు లోనే జరుగుతుంది శృతిహాసన్ ఈ పాట గురించి ఈ కామెంట్లు చేసిందని అభిమానులు మండి పడుతున్నారు. సినిమా షూటింగ్ కి ముందు తనే ఒప్పుకొని ఇప్పుడు ఇలా కంప్లైంట్ ఇవ్వడం దేనికి అంటూ అభిమానులు శృతిహాసన్ ను ప్రశ్నిస్తున్నారు.

అయితే మరి కొందరు మాత్రం షూటింగ్ సమయంలో షాట్ గ్యాప్స్ లలో శృతిహాసన్ కి కూడా జాకెట్స్ ఇచ్చారని అంటున్నారు. చిరంజీవి మరియు శృతిహాసన్ కి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే శృతిహాసన్ ఇప్పుడు ఇలాంటి కామెంట్లు చేస్తుందని టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాతో పాటే విడుదలైన "వీర సింహా రెడ్డి" సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. కానీ ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన శృతిహాసన్ "వాల్తేరు వీరయ్య" సినిమాకి సంబంధించి ఒక్క ప్రమోషన్ లో కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి మరియు శృతిహాసన్ కి మధ్య నిజంగానే విభేదాలు వచ్చాయని కొందరు ఖరారు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story