Shruti Haasan: బాలకృష్ణతో సినిమా కోసం కొన్ని కండిషన్లు పెట్టిన శృతిహాసన్

Shruti Haasan has set Some Conditions for the Film With Balakrishna
x
బాలకృష్ణ సినిమాకోసం కొన్ని కండిషన్స్ పెట్టిన శృతి హాసన్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Shruti Haasan: శృతిహాసన్ బాలకృష్ణ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఇదేనా?

Shruti Haasan: ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" సినిమాతో బిజీగా ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ సినిమా పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో శృతిహాసన్ కనిపించబోతున్నట్లు దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. మొదట శృతిహాసన్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదని, కానీ నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకు రావడం తో శృతి హాసన్ ఈ సినిమాకి ఓకే చెప్పేసిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు శృతిహాసన్ వారికి కొన్ని కండిషన్లు పెట్టిందట. డాన్స్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని కానీ సినిమాలో మాత్రం హగ్ మరియు ఇంటిమేట్ సన్నివేశాలు పెట్టొద్దని దర్శక నిర్మాతలకు సూచించిందట. ఈ సినిమాలో తన పాత్ర గౌరవప్రదంగా ఉండాలని గ్లామరస్గా చూపించవద్దని చెప్పిందట. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా దీనికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతోంది. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories