Shruti Haasan: వెబ్ సిరీస్ లో మెరవనున్న శృతిహాసన్

Shruti Haasan: లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు బాగానే క్రేజ్ పెరిగింది.

admin1
Published on: 30 Aug 2021 6:07 PM IST
Shruti Haasan Doing Web Series for Amazon Prime
X

Shruti Haasan: వెబ్ సిరీస్ లో మెరవనున్న శృతిహాసన్

Shruti Haasan: లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు బాగానే క్రేజ్ పెరిగింది. థియేటర్లు రీ ఓపెన్ అయినప్పటికీ కొన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో స్టార్ నటీనటుల నుంచి చిన్నపాటి దర్శకుల వరకు అందరూ ఓటీటీ లపై కన్నేశారు. ఇప్పటికే పలు స్టార్ నటులు వెబ్ సిరీస్ చేయడానికి ముందుకు వచ్చారు. హీరోయిన్లు సైతం సిరీస్ పైనే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే వెబ్ సిరీస్ చేస్తున్న స్టార్ హీరోయిన్ల జాబితాలో సమంత కాజల్ వంటి హీరోయిన్ లతో శృతిహాసన్ పేరు కూడా చేరిపోయింది.

ఇప్పటికే "పిట్టకథలు" అని అంథాలజీ తో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో అడుగుపెట్టిన శృతిహాసన్ తాజాగా ఇప్పుడు మరొక వెబ్ సిరీస్ చేసేందుకు సైన్ చేసిందట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తానే స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది శృతిహాసన్. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఆమె ఒక వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతోంది? ఇందులో ఎవరెవరు నటించనున్నారు అనే విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు "క్రాక్" సినిమాతో హిట్ అందుకున్న శ్రుతి హాసన్ ప్రభాస్ "సలార్" సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.

admin1

admin1

Next Story