Shruti Haasan: పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చిన శృతి హసన్

Sandeep Reddy
Updated on: 21 Aug 2021 9:30 PM IST
Shruti Haasan Clarifies in Social Media About His Marriage
X

శృతి హసన్ (ట్విట్టర్ ఫోటో)

Shruti Haasan: మంచి హిట్ సినిమాలను అందిస్తూ ముందుకు దూసుకుపోతున్న శృతిహాసన్ కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో కం బ్యాక్ ఇచ్చిన శ్రుతి హాసన్ క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని సాధించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రుతిహాసన్ ఈ మధ్యనే ఫాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు శృతిహాసన్ జవాబు ఇస్తూ వచ్చారు. అందులో భాగంగా శృతిహాసన్ పెళ్లి గురించి అడగగా, ఆమె ఇచ్చిన జవాబు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

"నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. ఇకనైనా ఈ ప్రశ్న ఆపేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది 2021. ప్రస్తుతం ప్రపంచంలో ఇంత కంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి" అంటూ శృతిహాసన్ జవాబిచ్చింది. ఇక సినిమాల పరంగా చూస్తే శృతిహాసన్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. "కే జి ఎఫ్ చాప్టర్ వన్" ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా శృతిహాసన్ తమిళంలో విజయ్ సేతుపతి సరసన లాభం అనే సినిమాలో నటిస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story