Shriya Saran: కూతురి పేరు చెప్పిన శ్రియ శరణ్

Shriya Saran: తన కూతురి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్న శ్రీయ

admin1
Updated on: 13 Oct 2021 3:29 PM IST
Shriya Saran Reveals the Name of her Nine Months Old Daughter
X

9 నెలల బిడ్డ ని ప్రపంచానికి పరిచయం చేసిన హీరోయిన్(ఫైల్ ఫోటో)

Shriya Saran: ప్రముఖ నటి శ్రియ శరణ్ తాజాగా అభిమానులకు ఒక షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటూ వస్తున్న శ్రియ సడన్ గా తన తొమ్మిది నెలల కూతురిని ప్రపంచాన్ని పరిచయం చేసింది. దీంతో అభిమానులు సైతం ఖంగుతిన్నారు. తాజాగా తన కూతురి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది శ్రీయ. పాపను ప్లాన్ చేసుకునే కన్నామని చెప్పుకొచ్చింది ఈ స్టార్ బ్యూటీ. గత ఏడాది కరోనా వల్ల ప్రపంచమంతా ఆగిపోయినట్టు అనిపించింది, ఆ సమయంలోనే ఫ్యామిలీ ని స్టార్ట్ చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారని చెప్పింది.

తన కూతురికి "రాధ" అనే నామకరణం చేసినట్లు తెలిపిన శ్రీయ ఆమె ట్రావెల్ బేబీ అని ఇప్పటికీ ప్రపంచంలో చాలా ప్రదేశాలలో చుట్టేసి వచ్చిందని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో శ్రియ మరియు తన భర్త బార్సిలోనా లో ఉన్నారు. రాధ కూడా జన్మించింది. ఇక ఈ మధ్యనే ముంబైకి తిరిగి వచ్చినా శ్రీయ మళ్ళీ సినిమా ఆఫర్ల కోసం వెతుకుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ఆర్ఆర్" సినిమాలో శ్రియ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం బరువు తగ్గి ఫిట్ గా మారిన శ్రీయ తెలుగులో "గమనం" అని ఇంకొక సినిమా కూడా చేస్తోంది.

admin1

admin1

Next Story