Shriya Saran: పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన శ్రియ సరన్

Shriya Saran: సౌత్ స్టార్ బ్యూటీ అయిన శ్రియ శరన్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే...

admin1
Updated on: 12 Oct 2021 1:15 PM IST
Shriya Saran Blessed with Baby Girl | Tollywood News Today
X

Shriya Saran: పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన శ్రియ సరన్ 

Shriya Saran: సౌత్ స్టార్ బ్యూటీ అయిన శ్రియ శరన్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె బాయ్ ఫ్రెండ్ అండ్రీ తో పెళ్లి అయిన తర్వాత నుంచి శ్రీయ ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉంటుంది. తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన శ్రియ శరణ్ ఇప్పుడు ఒక షాకింగ్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. ఆమె తన మొట్టమొదటి బిడ్డకి జన్మనిచ్చినట్లు గా ప్రకటించింది శ్రియ. ఒకవైపు ప్రపంచమంతా గందరగోళం గా ఉంటే మరోవైపు తాము తమ జీవితాల్లోకి ఒక అందమైన ఏంజెల్ వచ్చిందంటూ ఆమె పంచుకున్నారు.

"హలో పీపుల్... 2020 క్వారంటైన్ చాలా క్రేజీ మరియు అందంగా గడిచింది. ఒకవైపు ప్రపంచమంతా అందమైన గందరగోళం లో ఉండగా మా జీవితాలు మారిపోయాయి. మా జీవితం ఎడ్వెంచరస్ మరియు ఎగ్జైటింగ్ గా మారింది. మా జీవితాల్లోకి ఒక అందమైన ఏంజెల్ వచ్చింది. దానికోసం దేవుడికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం" అని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది శ్రీయ. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మరియు ఎంటర్ప్రెన్యూర్ అయిన రష్యా దేశస్థుడు ఆండ్రూ కొస్చీవ్ నీ 2018లో శ్రియ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story