Shreya Ghoshal: తల్లిని కాబోతున్నానంటూ శ్రేయాఘోషాల్ ట్వీట్

Shreya Ghoshal: `బేబీ శ్రేయాదిత్య కమింగ్` అంటూ ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా శ్రేయ అభిమానులతో పంచుకుంది.

Kranthi
Published on: 4 March 2021 12:59 PM IST
Shreya Ghoshal Tweeted That She was Going to be a Mother
X

ఫైల్ ఇమేజ్


Shreya Ghoshal: పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో అందరినీ అలరిస్తున్న బెంగాలీ గాయని శ్రేయా ఘోషల్ తల్లి కాబోతోంది. `బేబీ శ్రేయాదిత్య కమింగ్` అంటూ ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా శ్రేయ అభిమానులతో పంచుకుంది. ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో మీ అందరి ప్రేమ, దీవెనలు కావాల`ని శ్రేయ ట్వీట్ చేసింది. బేబీ బంప్‌తో ఉన్న తన ఫొటోను షేర్ చేసింది.

2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తన విశేష ప్రతిభకు గాను పలు భాషల్లో అనేక జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్నారు.

Kranthi

Kranthi

Next Story