Shreya Ghoshal: మగబిడ్డకు జన్మనిచ్చిన శ్రేయా ఘోషల్

Shreya Ghoshal: శ్రేయా ఘోషల్ నేడు పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఈమేరకు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు.

Venkata Chari
Published on: 22 May 2021 5:45 PM IST
Shreya Ghoshal Blessed With a Baby Boy Calls it an Emotion Never Felt Before
X

శ్రేయా ఘోషల్ (ఫొటో ట్విట్టర్)

Shreya Ghoshal: శ్రేయా ఘోషల్ కు నేడు పండంటి అబ్బాయి పుట్టాడు. ఈమేరకు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ... అభిమానులతో ఈ వార్తను పంచుకున్నారు. "దేవుడు ఈ రోజు పండంటి మగబిడ్డను మాకు ఆశీర్వదించాడు. ఇది మునుపెన్నడూ మేము అనుభవించని భావోద్వేగం. నేను, నాభర్త షీలాదిత్యతో పాటు మా కుటుంబాలు ఎంతో ఆనందంలో మునిగిపోయాయి. మీ విలువైన ఆశ్వీరాదాలు అందించినందుకు చాలా ధన్యవాదాలంటూ" రాసుకోచ్చారు.

శ్రేయా ఘోషల్ ఈ ఏడాది మార్చిలో ప్రెగ్నెంట్ అయ్యానని ప్రకటించారు. ఈ 36 ఏళ్ల గాయని తన ఇన్‌స్టాగ్రామ్ లో బేబీ బంప్‌ తో ఉన్న ఫొటోను పంచుకుంది. ఈమేరకు ఈ వార్తను మీతో పంచుకుంటుంన్నందుకు నేను, భర్త చాలా సంతోషిస్తున్నాం. మా జీవితాల్లో ఓ కొత్త అధ్యాయానికి సిద్ధం కాబోతున్నాం. ఇందుకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరారు.

కాగా, 2015 లో 37 ఏళ్ల షీలాధిత్య ముఖోపాధ్యాయతో శ్రేయా ఘోషల్ వివాహం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో పాటలు పాడి ఆకట్టుకున్న ఈ నటి.. 2019 లో 'కలంక్' లోని 'ఘర్ మోర్ పార్దేసియా', 2018 లో 'ధడక్', 2015లో 'బాజీరావ్ మస్తానీ' లో 'దీవానీ మస్తానీ' సాంగ్ లతోపాటు దేవదాస్ సినిమాలో 'బైరి పియా' లాంటి పాటలతో పాపులర్ అయ్యారు. అయితే సింగర్‌గా 2002లో దేవదాస్ సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారభించింది శ్రేయా ఘోషల్.


Venkata Chari

Venkata Chari

Next Story