Shraddha Srinath: నయనతార స్థానంలో "జెర్సీ" హీరోయిన్

* నయనతార బదులుగా శ్రద్ధ శ్రీనాథ్ ని ఎంపిక చేసిన దర్శకనిర్మాతలు

admin1
Published on: 22 Nov 2021 10:47 AM IST
Shraddha Srinath Acting in Yuvaraj Dhayalan New Movie in Place of Nayanthara
X

శ్రద్ధ శ్రీనాథ్(ఫైల్ ఫోటో) 

Shraddha Srinath: సౌత్ స్టార్ బ్యూటీ నయనతార తాజాగా ఒక సినిమాని ఒప్పుకున్నారు. "పోటా పోటీ", "తెనాలి రామన్", "ఎలి" వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన యువరాజ్ దయాలన్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటించడానికి సైన్ చేసింది.

కానీ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కడంతో ఆమె ఈ సినిమాకి నుండి తప్పుకుంది నయనతార. షారుక్ ఖాన్ హీరోగా తమిళ డైరెక్టర్ ఆట్లీ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నయనతార ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దయాలన్ దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్నారు.

కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఎల్ల షారుక్ సినిమా షూటింగ్ వాయిదా పడి మళ్ళీ మొదలైంది. దీంతో నయనతార మళ్లీ ఆ సినిమా కోసం డేట్లు ఇవ్వాల్సి వచ్చింది. మరోవైపు యువరాజ్ దయాలన్ కూడా సినిమా షూటింగ్ మొదలు పెట్టేసారు. నయన్ లేకుండా కొన్ని సన్నివేశాల షూటింగ్ పూర్తి చేశారు.

ఇంకా షారుఖ్ ఖాన్ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు కాబట్టి నయనతార ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన లేకపోతుంది. ఇక చేసేదిలేక డేట్లు కుదరకపోవడంతో యువరాజ్ సినిమా నుంచి తప్పుకుంది నయనతార. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఇప్పుడు శ్రద్ధ శ్రీనాథ్ ని ఎంపిక చేశారట. "జెర్సీ" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పుడు నయనతార స్థానంలో యువరాజ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

admin1

admin1

Next Story