Shraddha Das Clarifies Bigg Boss Telugu Season 4: బిగ్ బాస్ లోకి వెళ్ళడం లేదు : శ్రద్ధాదాస్‌

Shraddha Das Clarifies Bigg Boss Telugu Season 4: ఇప్పటివరకూ మూడు సీజన్ లతో ఆకట్టుకున్న తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్ కి సిద్దం అవుతుంది. తాజాగా స్టార్ మా దీనిపైన క్లారిటీ ఇచ్చింది.

Krishna
Published on: 27 July 2020 8:02 PM IST
Shraddha Das Clarifies Bigg Boss Telugu Season 4: బిగ్ బాస్ లోకి వెళ్ళడం లేదు : శ్రద్ధాదాస్‌
X
Shraddha Das Clarifies Bigg Boss Telugu Season 4 Rumours

Shraddha Das Clarifies Bigg Boss Telugu Season 4: ఇప్పటివరకూ మూడు సీజన్ లతో ఆకట్టుకున్న తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్ కి సిద్దం అవుతుంది. తాజాగా స్టార్ మా దీనిపైన క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ షోలో ఎవరెవరు పాల్గొంటారు అన్నదానిపైన చర్చ నడుస్తుంది. అయితే ఇదే తుది జాబితా అంటూ ఓ లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో హీరోయిన్ శ్రద్ధాదాస్‌ కూడా ఉంది. అయితే నిజంగానే శ్రద్ధాదాస్‌ బిగ్ బాస్ లో ఉంటుందా అనే దానిపైన తన ట్విట్టర్ వేదికగా ఆమె సమాధానం ఇచ్చింది.

" తెలుగు బిగ్ బాస్ లో పాల్గొనమని నన్ను ఎవరు సంప్రదించలేదు. దీనిపైన చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఏదైనా సరే.. క్లారిటీగా తెలుసుకున్న తర్వాతే రాయడం మంచిది. లేకపోతే అలాంటి వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది నా మొదటి హెచ్చరిక" అని ట్విట్టర్ లో పేర్కొంది శ్రద్ధాదాస్‌.. ఇక శ్రద్ధా దాస్ తెలుగులో హీరోయిన్ గా సుపరిచితురాలే.. సిద్దు ఫ్రం శ్రీకాకుళం, ఆర్య 2, రేయ్ చిత్రాలతో మంచి ఫేం సంపాదించుకుంది ఈ బ్యూటి..

ఇక అటు బిగ్ బాస్ నాలుగో సీజన్ కోసం ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనే హౌస్‌మేట్స్‌, ఇతర సాంకేతిక నిపుణులు, వ్యాఖ్యాతలకు ప్రత్యేకంగా బీమా చేయించినట్లుగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఇక హౌస్‌లోకి వెళ్ళేవారు 15 రోజుల ముందుగానే క్వారంటైన్‌కు వెళ్ళాల్సి ఉంటుందని, తెలుస్తోంది. ఇక హోస్ట్ పైన కూడా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే హౌస్ లోకి ఎవరు వెళ్తారు. ఎంతమంది వెళ్తారు. ఎన్ని రోజులు షో ఉంటుంది ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి ఉండక తప్పదు.


Krishna

Krishna

Next Story