Das Ka Dhamki: అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి...

Vishwak Sen: అనుకున్న సమయం కంటే ఇంకా ముందే విడుదల అవ్వనున్న విశ్వక్ సేన్ సినిమా

Dhatripriya
Updated on: 29 March 2023 9:30 PM IST
Shocking Update On OTT Release Of Das Ka Dhamki Movie
X

"దాస్ కా ధమ్ కీ" సినిమా ఓటీటీ విడుదల పై షాకింగ్ అప్డేట్

Vishwak Sen: యువ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యనే "దాస్ కా ధమ్ కీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఉగాది సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాని చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోట్ చేయడంతో సినిమాకి మంచి ఓపెనింగ్ కలెక్షన్లు లభించాయి. కానీ ఆ తరువాత మాత్రం కలెక్షన్లు తగ్గిపోయాయి. కేవలం కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చింది.

సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి ఈ సినిమా 6.80 కోట్ల రిలీజ్ బిజినెస్ వచ్చేసింది. ఇక మిగతా ప్రాంతాలు ఓవర్సీస్ లో కలిపి 70 లక్షలు బిజినెస్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను నమోదు చేసుకుంది. ఇక ప్రమోషన్ల కారణంగా ఈ సినిమాకి మొదటి రోజే ఎనిమిది కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చేసాయి. కానీ రెండు మూడు రోజుల్లో కలెక్షన్లు భారీగా తగ్గుముఖం పట్టాయి.

అదే సమయంలో కృష్ణవంశీ తెరకెక్కించిన "రంగమార్తాండ" సినిమా కూడా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది కానీ విశ్వక్ సేన్ సినిమా కలెక్షన్లు కూడా పర్వాలేదు అనిపించాయి. అయితే "బలగం" సినిమా కూడా థియేటర్లలో మంచి రివ్యూస్ లో నడుస్తోంది. ఈ సినిమా కారణంగా పోలిస్తే మాత్రం "దాస్ కా ధమ్కీ" కలెక్షన్లు బాగా తగ్గాయనే చెప్పాలి. సోమవారం నాడు "బలగం" కంటే "ధమ్కీ" కే తక్కువ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల విశ్లేషణ. ఇక ఓటీటీ లో సినిమా మే లో విడుదల అవ్వాలి కానీ కలెక్షన్స్ తగ్గడంతో సినిమా అనుకున్న డేట్ కంటే ముందే ఓటీటీ లకి రావచ్చని టాక్ కూడా వినిపిస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story