నాని "దసరా" సినిమా గురించి షాకింగ్ అప్డేట్..

Shocking Update About Nani Dussehra Movie
x

నాని "దసరా" సినిమా గురించి షాకింగ్ అప్డేట్..

Highlights

* రెండు భాగాలుగా విడుదల కాబోతున్న నాని సినిమా

Dasara Movie: ఈ మధ్యనే అంటే సుందరానికి సినిమాతో హిట్ అందుకున్నా నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు "దసరా" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల మందికి రాబోతున్న ఈ సినిమాలో నాని ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఒక విభిన్నమైన రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. తెలంగాణలోని గోదావరిఖని దగ్గర సింగరేణి బొగ్గు గని బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథ నడుస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజా సమాచారం ప్రకారం "దసరా" సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతునట్లు తెలుస్తోంది. నాని కరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమాను దర్శక నిర్మాతలు ఇప్పుడు రెండు భాగాలుగా విభజించారు. దీని గురించి నా అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

ఇక సినిమాకి సంబంధించిన మొదటి భాగం ఈ ఏడాది మార్చిలో విడుదల కాబోతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి ఈ సంగీతాన్ని అందిస్తున్నారు. సముతిరఖని, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ మరియు పూర్ణ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories